ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: పుదుచ్చేరి మాజీ సీఎం

ABN , First Publish Date - 2021-03-22T12:52:20+05:30 IST

ఈ కారణంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నారాయణ స్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘సెక్యూలర్ డెమొక్రటిక్ అలయన్స్’ ఏర్పాటు చేసింది. మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరి

ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: పుదుచ్చేరి మాజీ సీఎం

పుదుచ్చేరి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పుదుచ్చరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీలో పోలింగ్ పరమైన సమన్వయం సరిగా లేదని, అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆదివారం ప్రకటించారు. ఆదివారం పీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ కరైకల్ నియోజకవర్గం నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏవీ సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారని, పార్లమెంట్ సభ్యుడు వి.వైతిలింగంతో పాటు తాను ఎన్నికలకు సబంధించి పార్టీ కార్యక్రమాలను చూసుకోవాని మాజీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.


ఈ కారణంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నారాయణ స్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘సెక్యూలర్ డెమొక్రటిక్ అలయన్స్’ ఏర్పాటు చేసింది. మొత్తం 30 నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ 15 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఏప్రిల్ 6న పుదుచ్చేరి అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2021-03-22T12:52:20+05:30 IST