మమతను అభినందించిన మోదీ

ABN , First Publish Date - 2021-05-03T01:26:37+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత్రి..

మమతను అభినందించిన మోదీ

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీ అభినందలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌కు అన్నిరకాలుగా కేంద్ర సహకారాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కోవిడ్ సమస్యను అధిగమించేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మమతా బెనర్జీ సాధించిన విజయంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, కేంద్ర నేతలు సైతం అభినందనలు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ స్టాలిన్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు అభినందనలు తెలిపారు.


Updated Date - 2021-05-03T01:26:37+05:30 IST