సీఏఏ తెస్తాం, బంగారు బంగ్లా సాకారం చేస్తాం: మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా

ABN , First Publish Date - 2021-03-22T00:06:26+05:30 IST

పశ్చిమబెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో హోం మంత్రి అమిత్‌షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ మేనిఫెస్టోను 'సంకల్ప్ పాత్ర'గా పిలవాలని పార్టీ నిర్ణయించినట్టు అమిత్‌షా ఈ సందర్భంగా తెలిపారు.

సీఏఏ తెస్తాం, బంగారు బంగ్లా సాకారం చేస్తాం: మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో హోం మంత్రి అమిత్‌షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ మేనిఫెస్టోను 'సంకల్ప్ పాత్ర'గా పిలవాలని పార్టీ నిర్ణయించినట్టు అమిత్‌షా ఈ సందర్భంగా తెలిపారు. ఇది కేవలం మేనిఫెస్టో కాదని, దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పశ్చిమబెంగాల్‌ కోసం చేసిన తీర్మాన పత్రం (రిజల్యూషన్ లెటర్) అని పేర్కొన్నారు. బంగారు బంగ్లాగా బెంగాల్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ ప్రధాని లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఇంటింటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ మహిళలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. చొరబాటుదార్లను రాష్ట్రంలోని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సరిహద్దు పెన్సింగ్‌ను పటిష్టం చేస్తామని చెప్పారు.


తొలి మంత్రివర్గ సమావేశంలోని పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేస్తామని, 70 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని అన్నారు. ఒక్కో శరణార్థి కుటుంబానికి ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.10,000 ఇస్తామని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొనసాగిస్తామని, మూడేళ్లుగా రైతులకు మమతా బెనర్జీ దీనిని అమలు చేయడం లేదని, 75 లక్షల మంది రైతులకు ఎలాంటి కోతా లేకుండా రూ.18,000 చొప్పునవారి అకౌంట్లకు నేరుగా బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-22T00:06:26+05:30 IST