బీజేపీ.. అతిపెద్ద దోపిడీదారు: మమత
ABN , First Publish Date - 2021-03-21T07:11:29+05:30 IST
ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ను పాలించే అవకాశం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఓటర్లను కోరారు

కోల్‌కతా, మార్చి 20: ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ను పాలించే అవకాశం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఓటర్లను కోరారు. ‘‘మీకు (ప్రజలు) అల్లర్లులేని రాష్ట్రం కావాలంటే టీఎంసీ ఒక్కటే మార్గం. బీజేపీకి బెదిరించడమే తెలుసు. ప్రధాని మోదీ.. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేసి దేశాన్ని అమ్మేస్తున్నారు’’ అని మమత వ్యాఖ్యానించారు.