ఏపీ వ్యాప్‌కోస్‌లో మేనేజర్లు

ABN , First Publish Date - 2021-03-21T18:02:48+05:30 IST

వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌... ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు..

ఏపీ వ్యాప్‌కోస్‌లో మేనేజర్లు

వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌... ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్లు, స్పెషలిస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు పోస్టింగు ఖరారు చేస్తారు.  


ఖాళీల వివరాలు: మొత్తం 15 పోస్టులు ప్రకటించారు. వీటిలో సీనియర్‌ మేనేజర్లు(సివిల్‌, మెకానికల్‌, ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌) 3, ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌ 1, ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ 1, మేనేజర్లు(సివిల్‌, ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌, జీఐఎస్‌) 5, అసిస్టెంట్‌ మేనేజర్లు(ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌, ఫైనాన్స్‌) 3, ఆమిన్స్‌ 2 ఖాళీలు ఉన్నాయి. 


అర్హత: ఇంజనీరింగ్‌ సంబంధిత విభాగాల్లోని పోస్టులకు బీఈ/ బీటెక్‌(సివిల్‌/ మెకానికల్‌) ఉత్తీర్ణత అవసరం. జీఐఎస్‌ విభాగానికి ఏదైనా డిగ్రీ పాసైతే చాలు. ఫైనాన్స్‌ విభాగానికి బీకాం/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఏ పూర్తిచేసి ఉండాలి. ఆమిన్లకు డిప్లొమా(సివిల్‌)/ సర్టిఫికెట్‌ కోర్స్‌ (ఆమిన్‌)/ ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని పోస్టులకూ నిర్దేశిత అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు జనవరి 31 నాటికి 68 ఏళ్లు మించకూడదు. 


ముఖ్య సమాచారం

వేతనం: ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ మేనేజర్లకు రూ.80,000; మేనేజర్లకు రూ.65,000; ఎల్‌ఏ అండ్‌ ఆర్‌ఆర్‌ విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్లకు రూ.45,000; ఫైనాన్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.35,000; ఆమిన్లకు రూ.20,000

ఈ మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6

ఈ మెయిల్‌: wapcos.recruitmentcell@gmail.com 

వెబ్‌సైట్‌: wapcos.gov.in

Updated Date - 2021-03-21T18:02:48+05:30 IST