మహిళలకు వెబినార్‌

ABN , First Publish Date - 2021-02-26T18:34:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓ వెబినార్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోంది. దీనికి మైక్రోసాఫ్ట్‌, నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సహకారం అందిస్తున్నాయి. ‘మైక్రోసాఫ్ట్‌ డైవర్సిటీ స్కిల్లింగ్‌ ఇనీషియేటివ్‌

మహిళలకు వెబినార్‌

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓ వెబినార్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోంది. దీనికి మైక్రోసాఫ్ట్‌, నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సహకారం అందిస్తున్నాయి. ‘మైక్రోసాఫ్ట్‌ డైవర్సిటీ స్కిల్లింగ్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ విమెన్‌’ పేరిట నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి నెల రోజులు. ఇందులో మహిళలకు పలు ఆర్థిక వ్యవహారాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగాన్ని వివరిస్తారు. లక్ష మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు నిర్వహణ నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ రూపొందించారు. 


ప్రోగ్రామ్‌ వివరాలు: ప్రోగ్రామ్‌ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ సాయంత్రం గం. 4 నుంచి గం. 6.30 ని. వరకు సెషన్స్‌ ఉంటాయి. ఆన్‌లైన్‌లో 70 గంటలకు పైగా ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. డిజిటల్‌ లిటరసీ, ఇంగ్లీష్‌, ఉపాధి అవకాశాలు, వ్యవస్థాపక అంశాలతోపాటు 30కి పైగా లెర్నింగ్‌ మాడ్యూల్స్‌పై వివరణాత్మక తరగతులు ఉంటాయి. 


రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 28

సెషన్‌ లింక్‌: https://rebrand.ly/mdsi

రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://t.me/joinchat/1dkujKKFDgX0sxTx

వెబ్‌సైట్‌: apssdc.in

Updated Date - 2021-02-26T18:34:08+05:30 IST