గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ‘TGUGCET’
ABN , First Publish Date - 2021-12-10T17:43:19+05:30 IST
తెలంగాణ సాంఘిక..
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీయూజీసెట్ నోటిఫికేషన్ విడులైంది.
పరీక్ష పేరు: తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీజీయూజీ సెట్)-2022
కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ. ఈ కోర్సులన్నీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటాయి.
డిగ్రీ కళాశాలలు
టీఎ్‌సడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ బుద్వేల్: ఈ కాలేజీ ఘట్‌కేసర్‌లోని అంకుషాపూర్‌లో ఉంది.
టీఎ్‌సడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ మహేంద్ర హిల్స్: ఈ కాలేజీ ఘట్‌కేసర్‌లోని అంకుషాపూర్‌లో ఉంది.
టీఎ్‌సడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ కామర్స్ ్క్ష మేనేజ్‌మెంట్ ఫర్ ఉమెన్ సంగారెడ్డి(బుధెర)
టీఎ్‌సడబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఇబ్రహీంపట్నం: ఈ కాలేజీ ఘట్‌కేసర్‌లోని అంకుషాపూర్‌లో ఉంది.
పై నాలుగు కాలేజీలు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి. ఇవే కాకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 24, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరో 15 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7 పురుషుల రెసిడెన్షియల్ కళాశాలలను నిర్వహిస్తున్నారు. ఇవి ఆదిలాబాద్(బోధ్), ఖమ్మం(మణుగూరు), వరంగల్(మరిపెడ), కరీంనగర్, నిజామాబాద్(కామారెడ్డి), నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కలిపి నాగర్ కర్నూల్‌లో; హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కలిపి సంగారెడ్డిలో ఉన్నాయి. ఈ కాలేజీల్లో బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(బైపీసీ), బీకాం, బీఏ తదితర కోర్సులు నిర్వహిసున్నారు.
అర్హత: 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన/కనీ సం 40 శాతం మార్కులతో 2021లో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: టీజీయూజీసెట్ ఆధారంగా
టీజీయూజీసెట్ వివరాలు: ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులు కేటాయించారు. పరీక్షను మొత్తం ఐదు గ్రూపుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి చదవాలనుకొన్న గ్రూపును దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. సిలబస్ ఇంటర్మీడియెట్ స్థాయిలోనే ఉంటుంది.
పరీక్షను నిర్వహించే గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 10
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి: 10
వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in/