మైనారిటీలకు Scholarships

ABN , First Publish Date - 2021-10-29T15:10:46+05:30 IST

భారత ప్రభుత్వ మైనారిటీ..

మైనారిటీలకు Scholarships

భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ - మైనారిటీలకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లకు దరఖాస్తులు కోరుతోంది. జైన, బౌద్ద, సిక్కు, జోరాష్ట్రియన్‌, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. గత ఏడాది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అకడమిక్‌ ప్రతిభ, పుట్టిన తేదీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగలవారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌

ఒకటి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులు ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. 

స్కాలర్‌షిప్‌: ఆరు నుంచి తొమ్మిదోతరగతి చదివే విద్యార్థులకు అడ్మిషన్‌ ఫీజు కింద ఏడాదికి రూ.500; ట్యూషన్‌ ఫీజు కింద నెలకు రూ.350 చెల్లిస్తారు. మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద డే స్కాలర్‌ విద్యార్థులకు నెలకు రూ.100లు ఇస్తారు. ఆరు నుంచి తొమ్మిదోతరగతి చదువుతూ హాస్టల్‌లో ఉండే వారికి నెలకు రూ.600 ఇస్తారు.


పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌

ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలలో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ డిగ్రీ/ పీజీ / పీహెచ్‌డీ కోర్సుల్లో  ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కీమ్‌ కింద అప్లయ్‌ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదు.  

స్కాలర్‌షిప్‌: అడ్మిషన్‌ + ట్యూషన్‌ ఫీజు కింద ఇంటర్‌/ పన్నెండో తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.7,000; ఇంటర్‌ లెవెల్లో ఒకేషనల్‌/ టెక్నికల్‌ కోర్సులు చదివే వారికి ఏడాదికి రూ.10,000; డిగ్రీ, పీజీ అభ్యర్థులకు ఏడాదికి రూ.3,000 చెల్లిస్తారు. మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద ఇంటర్‌ స్థాయి కోర్సులు చదువుతున్న హాస్టల్‌ విద్యార్థులకు 


నెలకు రూ.380, డే స్కాలర్‌ విద్యార్థులకు నెలకు రూ.230; డిగ్రీ, పీజీ చదువుతున్న హాస్టల్‌ విద్యార్థులకు నెలకు రూ.570, డే స్కాలర్‌ అభ్యర్థులకు రూ.300; పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేస్తున్న హాస్టల్‌ అభ్యర్థులకు నెలకు రూ.1200, డే స్కాలర్‌ అభ్యర్థులకు రూ.550 చెల్లిస్తారు.

 

మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌

గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ప్రొఫెషనల్‌ కోర్సులు, టెక్నికల్‌ కోర్సులలో చేరినవారు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రెండున్నర లక్షలకు మించకూడదు. 

స్కాలర్‌షిప్‌: కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ.20,000; మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద హాస్టల్‌ ఖర్చుల కోసం నెలకు రూ.1,000; డే స్కాలర్‌కి నెలకు రూ.500 ఇస్తారు.


ముఖ్య సమాచారం

ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15

పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షి్‌పల దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

ఎన్‌ఎ్‌సపీ పోర్టల్‌: scholarships.gov.in

వెబ్‌సైట్‌: minorityaffairs.gov.in/en/schemesperformance/

Updated Date - 2021-10-29T15:10:46+05:30 IST