BITS Pilaniలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2021-11-26T15:37:22+05:30 IST

పిలానీలోని..

BITS Pilaniలో పీహెచ్‌డీ

పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (సెకండ్‌ సెమిస్టర్‌)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పార్ట్‌ టైం, ఫుల్‌ టైం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంప్‌సల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు.


స్పెషలైజేషన్‌లు: బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌,  కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌, మేథమెటిక్స్‌, ఫార్మసీ

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఫార్మసీ/ ఎంబీఏ/ ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ/ బీఈ/ బీఫార్మసీ అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు నిర్దేశిత కోర్సు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగానికి కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ పూర్తిచేసి ఉండాలి. రీసెర్చ్‌ అనుభవం ఉన్నవారు మాత్రమే పార్ట్‌ టైం పీహెచ్‌డీకి అర్హులు. 

ఫెలోషిప్‌: ఫుల్‌ టైం పీహెచ్‌డీ అభ్యర్థులకు ఫెలోషిప్‌ సౌకర్యం కల్పిస్తారు. వీరు వారానికి  8 నుంచి 10 గంటల పాటు అసిస్టెంట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఫార్మసీ/ ఎంబీఏ/ ఎంఫిల్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ఎమ్మెస్సీ/ బీఈ/ బీఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులకు మొదట నెలకు రూ.28,000; కోర్సు వర్క్‌ పూర్తయిన తరవాత నెలకు రూ.31,000 ఇస్తారు.

ఎంపిక: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిని మాత్రమే అడ్మిషన్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. మొత్తమ్మీద అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. యూజీసీ - సీఎ్‌సఐఆర్‌ నెట్‌ జేఆర్‌ ఎఫ్‌/ డీబీటీ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు అడ్మిషన్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి నేరుగా అడ్మిషన్‌ ఇస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2600

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: డిసెంబరు 10

అడ్మిషన్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ తేదీ: 2022 జనవరి 5

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 2022 జనవరి 10

క్యాంపస్‌ రిపోర్టింగ్‌: 2022 జనవరి 17

పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్‌: 2022 జనవరి 18

వెబ్‌సైట్‌: bitsadmission.com

Updated Date - 2021-11-26T15:37:22+05:30 IST