IIM Ahmedabadలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2021-11-23T16:17:09+05:30 IST

అహ్మదాబాద్‌లోని..

IIM Ahmedabadలో పీహెచ్‌డీ

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంఏ).... పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 


విభాగాలు: అగ్రికల్చర్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, ప్రొడక్షన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌, పబ్లిక్‌ సిస్టమ్స్‌, స్ట్రాటజీ

అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత పీజీ/ రెండేళ్ల పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాస్తున్నవారు కూడా అర్హులే. వీరు 2022 డిసెంబరు 31 నాటికి మార్కుల పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. పార్ట్‌ టైమ్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌, వారాంతం(వీకెండ్‌), సాయంకాల కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. 

ఎంపిక విధానం: క్యాట్‌ (2019/ 2020/ 2021) స్కోరు లేదా స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన ప్రకారం జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ యూజీసీ - జేఆర్‌ఎఫ్‌ (ఎకనామిక్స్‌/ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌/ డెవల్‌పమెంట్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ మేనేజ్‌మెంట్‌)/ ఐకార్‌-ఎస్‌ఆర్‌ఎఫ్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.  ఐఐఎంల నుంచి పీజీపీ/ పీజీపీఎక్స్‌/ పీజీపీ - పీఎంపీ కోర్సులు పూర్తిచేసినవారికి నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. 

ఫెలోషిప్‌: ట్యూషన్‌ ఫీజుతోపాటు కంప్యూటర్‌, లైబ్రరీ, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తదితర అకడమిక్‌ ఖర్చులు చెల్లిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.37,700; కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ రాసిన తరవాత నెలకు రూ.40,700; థీసిస్‌ ప్రపోజల్‌ సమర్పించిన తరవాత నెలకు రూ.45,200 ఇస్తారు. కంటిజెన్సీ అలవెన్స్‌ కింద ఏడాదికి రూ.25,000; ఇంటర్నేషనల్‌ సెమినార్లు, వర్క్‌షా్‌పలకు హాజరయ్యేందుకు గరిష్ఠంగా రూ.1,75,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 17

వెబ్‌సైట్‌: iima.ac.in

Updated Date - 2021-11-23T16:17:09+05:30 IST