NTPCలో పీజీడీఎం

ABN , First Publish Date - 2021-11-23T17:50:15+05:30 IST

నోయిడాలోని..

NTPCలో పీజీడీఎం

నోయిడాలోని ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఎన్‌ఎ్‌సబీ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంఏ) ఈ ప్రోగ్రామ్‌ల నిర్వహణలో సహకారం అందిస్తోంది. 


ప్రోగ్రామ్‌లు

- రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం - ఈఎం)

- 15 నెలల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - ఎగ్జిక్యూటివ్‌ (పీజీడీఎం - ఈ)


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బిఈ/ బీటెక్‌/ బీఎస్సీ/  బీబీఏ/ బీకాం ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ పూర్తిచేసినవారు కూడా అర్హులే. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం చాలు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2022 జూన్‌ 30 నాటికి మార్కుల పత్రాలు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. లేదంటే ఎన్‌ఎ్‌సబీ నిర్వహించే అడ్మిషన్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. పీజీడీఎం(ఎగ్జిక్యూటివ్‌) ప్రోగ్రామ్‌నకు అప్లయ్‌ చేసుకొనే అభ్యర్థులకు కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. 

ఎంపిక: పదోతరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అభ్యర్థుల అకడమిక్‌ ప్రతిభ; జాతీయ పరీక్ష స్కోర్‌/ ఎన్‌ఎ్‌సబీ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి పర్సనల్‌ అసె్‌సమెంట్‌ నిర్వహించి అనుభవం, నాయకత్వ లక్షణాలు తదితర స్కిల్స్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 10

పర్సనల్‌ అసె్‌సమెంట్‌ షెడ్యూల్‌: 2022 జనవరి 20

వెబ్‌సైట్‌: nsb.ac.in

Updated Date - 2021-11-23T17:50:15+05:30 IST