పవర్‌ సిస్టమ్స్‌లో PGDC

ABN , First Publish Date - 2021-10-21T16:05:22+05:30 IST

నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌..

పవర్‌ సిస్టమ్స్‌లో PGDC

నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ) ఆధ్వర్యంలోని పవర్‌ సిస్టమ్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఎ్‌సటీఐ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు (పీజీడీసీ)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ‘ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌’ ప్రధాన స్పెషలైజేషన్‌. ప్రోగ్రామ్‌ వ్యవధి 26 వారాలు. ప్రభుత్వం రూపొందించిన సేఫ్టీ అండ్‌ ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ రెగ్యులేషన్స్‌ 7 (3) ప్రకారం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ సంబంధిత అంశాలు బోధిస్తారు. థియరీతోపాటు ప్రాక్టికల్‌ సెషన్స్‌ ఉంటాయి.  ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్దేశించిన ఈ జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌ పవర్‌ సెక్టార్‌లో రాణించేందుకు ఉపకరిస్తుంది. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ ప్రతిభ, కౌన్సెలింగ్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/ పవర్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు. 


ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.1,45,000

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబరు 26

అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల: నవంబరు 27

కౌన్సెలింగ్‌: డిసెంబరు 2, 3

ప్రోగ్రామ్‌ ప్రారంభం: డిసెంబరు 6 నుంచి

వెబ్‌సైట్‌: npti.gov.in


Updated Date - 2021-10-21T16:05:22+05:30 IST