హైదరాబాద్‌ ఐఐటీలో పీజీ, పీహెచ్‌ డీ

ABN , First Publish Date - 2021-03-24T18:06:31+05:30 IST

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు ప్రకటించింది. ప్రోగ్రామ్‌నుబట్టి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా రెంటి ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎండిజైన్‌ కోర్సుకు సీడ్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు.

హైదరాబాద్‌ ఐఐటీలో పీజీ, పీహెచ్‌ డీ

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు విభాగాల్లో  పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు ప్రకటించింది. ప్రోగ్రామ్‌నుబట్టి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా రెంటి ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎండిజైన్‌ కోర్సుకు సీడ్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు.  


పీహెచ్‌డీ ప్రోగ్రాములు

స్పెషలైజేషన్‌ విభాగాలు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, బయో టెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, క్లయిమేట్‌ ఛేంజ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌.


అర్హత: ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ ప్రకారం సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ ఎండీ/ ఎండీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ/ఎమ్మెస్సీ/ సంబంధిత మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌/ సీఎ్‌సఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ డీబీటీ జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌ జేఆర్‌ఎఫ్‌/ డీఎ్‌సటీ - ఇన్‌స్పయిర్‌ పరీక్షల్లో అర్హత పొందినవారికి, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సంస్థలు/ లేబొరేటరీల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. 


పీజీ ప్రోగ్రాములు

ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌, ఎండిజైన్‌, ఎమ్మే (డెవల్‌పమెంట్‌ స్టడీస్‌) ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎమ్మేలో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.

ఎండిజైన్‌ స్పెషలైజేషన్లు: విజువల్‌ కమ్యూనికేషన్‌, మువింగ్‌ ఇమేజెస్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌ & ఫొటోగ్రఫీ.

ఎంటెక్‌ స్పెషలైజేషన్లు: అడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌, సివిల్‌, క్లయిమేట్‌ ఛేంజ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఈ వేస్ట్‌ రిసోర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ సెన్సార్‌ సిస్టమ్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికిల్‌ అండ్‌ ఏరోస్పేస్‌, మెడికల్‌ డివైస్‌ ఇన్నోవేషన్‌, పాలిమర్స్‌ అండ్‌ బయో సిస్టమ్స్‌, స్మార్ట్‌ మొబిలిటీ.


అర్హత: ఎమ్మే ప్రోగ్రామ్‌కు కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. ఎండిజైన్‌ ప్రోగ్రామ్‌కు ఇంటర్‌ తరవాత కనీసం 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ డిజైన్‌/ ఇంటీరియర్‌ డిజైన్‌ విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వ్యాలిడ్‌ సీడ్‌ స్కోరు తప్పనిసరి.  ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ/ సీఈపీటీ), బీఎ్‌ఫఏ అభ్యర్థులూ అర్హులే. పదోతరగతి ఉత్తీర్ణత తరవాత అయిదేళ్ల జీడీ ఆర్ట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారు, పీజీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌)ఉత్తీర్ణతతోపాటు ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఫార్మసీ/ బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్సీ (మేథ్స్‌/అప్లయిడ్‌ మేథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మెటీరియల్‌ సైన్స్‌)/ ఎంసీఏ అభ్యర్థులూ అర్హులే. గేట్‌ సహా విభాగాలకు ప్రత్యేకించిన ప్రముఖ జాతీయ పరీక్షల్లో స్కోరు సాధించినవారికి ప్రాధాన్యం ఉంటుంది.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ. 300(రిజర్వుడు వర్గాల వారికి రూ.150)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 7

వెబ్‌సైట్‌: www.iith.ac.in

Updated Date - 2021-03-24T18:06:31+05:30 IST