OUలో Part-time MBA ప్రోగ్రాములు

ABN , First Publish Date - 2021-11-09T18:00:20+05:30 IST

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన..

OUలో Part-time MBA ప్రోగ్రాములు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌...2021-22 విద్యా సంవత్సరానికి గాను పార్ట్‌టైం ఎంబీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


కోర్సులు

ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌) ఈవెనింగ్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు


ఎంబీఏ(పార్ట్‌టైం) ఈవెనింగ్‌

కోర్సు వ్యవధి: మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు)


అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీఎస్‌ ఐసెట్‌ 2021లో అర్హత సాధించి ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌/మేనేజీరియల్‌/అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:  టీఎస్‌ ఐసెట్‌ 2021లో  స్కోరు ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. టీఎస్‌ ఐసెట్‌ 2021కు హాజరుకాని వారు ఉస్మానియా యూనివవర్సిటీ డిసెంబరు 5న నిర్వహించనున్న ఓయూఎంబీఏ సెట్‌-2021లో అర్హత సాధించాలి. 

ఓయూఎంబీఏ సెట్‌-2021 వివరాలు: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమమం 90 నిమిషాలు.

పరీక్ష తేదీ: డిసెంబరు 05

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 04

చిరునామా: డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌-500 007, తెలంగాణ.

వెబ్‌సైట్‌: http://ouadmissions.com/

Updated Date - 2021-11-09T18:00:20+05:30 IST