గుడ్న్యూస్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2021-10-12T15:03:45+05:30 IST
భారత ప్రభుత్వరంగ సంస్థ..
ఓఎన్జీలో 309 గ్రాడ్యుయేట్ ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)... ఇంజనీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్
విభాగాలు: సిమెంటింగ్ మెకానికల్, సిమెంటింగ్ పెట్రోలియం, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, ఎన్విరాన్మెంట్, రిజర్వాయర్, సర్ఫేస్, వెల్స్ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2021లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 2021 జూలై 31 నాటికి పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతలు, గేట్-2021లో సాధించిన మెరిట్ స్కోర్, పర్సనల్ ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను గేట్ 2021 స్కోరుకు 60 మార్కులు, విద్యార్హతలకు 25, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎ్స/ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు
చివరి తేదీ: నవంబరు 01
వెబ్సైట్: https://www.ongcindia. com/wps/wcm/connect/en/home/