TIFRలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2021-10-07T14:50:01+05:30 IST

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌..

TIFRలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) - ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ (ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఎన్‌సీబీ సెంటర్లలో ప్రవేశాలు కల్పిస్తారు. 


స్పెషలైజేషన్లు

పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌

పీహెచ్‌డీ: సైన్స్‌ ఎడ్యుకేషన్‌

ఎమ్మెస్సీ: బయాలజీ, వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌ 


అర్హత:

పీహెచ్‌డీ అభ్యర్థులకు సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఏ/ ఎమ్మెస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎంఫార్మసీ/ ఎంఎస్‌/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి సంబంధిత సబ్జెక్ట్‌లతో బీఏ/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ బీఎస్‌/ బీవీఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీలో బయాలజీకి సైన్స్‌ డిగ్రీ; వైల్డ్‌ లైఫ్‌ బయాలజీకి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రోగ్రామ్‌ని అనుసరించి గేట్‌/ నెట్‌/ జెస్ట్‌/ జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారు సంస్థ నిర్వహించే ఆన్‌లైన్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు. వీరికి నేరుగా అడ్మిషన్లు ఇస్తారు.


ఫెలోషిప్‌

పీహెచ్‌డీ అభ్యర్థులకు మొదట నెలకు రూ.31,000 ఇస్తారు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.21,000 ఇస్తారు. తరవాత అభ్యర్థి చూపిన ప్రతిభ ప్రకారం నెలకు రూ.31,000 చెల్లిస్తారు. పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌ తరవాత అభ్యర్థులందరికీ నెలకు రూ.35,000 ఇస్తారు. ఎమ్మెస్సీలో బయాలజీ అభ్యర్థులకు నెలకు రూ.16,000; వైల్డ్‌లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌ అభ్యర్థులకు రూ.12,000 చెల్లిస్తారు. అందరికీ హెచ్‌ఆర్‌ఏ/ వసతి సౌకర్యం కల్పిస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.1200; మహిళలకు రూ.600

ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: డిసెంబరు 12

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌ 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 7

వెబ్‌సైట్‌: http:// univ.tifr. res.in

Updated Date - 2021-10-07T14:50:01+05:30 IST