NUJSలో ఎమ్మెస్సీ

ABN , First Publish Date - 2021-10-19T15:59:49+05:30 IST

కోల్‌కతాలోని నేషనల్‌ యూనివర్సిటీ..

NUJSలో ఎమ్మెస్సీ

కోల్‌కతాలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యూరిడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌యూజేఎస్‌) - ఎమ్మెస్సీ(ఫోరెన్సిక్‌ సైన్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది.  కోర్సు వ్యవధి రెండేళ్లు. దీనికి సంబంధించిన ప్రాక్టికల్‌ కోర్సును సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో నిర్వహిస్తారు.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ / ఆనర్స్‌ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ బోటనీ/ జువాలజీ/ ఆంత్రోపాలజీ/ మేథమెటిక్స్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. 

దరఖాస్తు ఫీజు: రూ.2,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 30

వెబ్‌సైట్‌: nujs.edu

Updated Date - 2021-10-19T15:59:49+05:30 IST