Palakkad IITలో ఎంఎస్, పీహెచ్‌డీ
ABN , First Publish Date - 2021-10-21T16:09:57+05:30 IST
పాలక్కడ్‌లోని ఇండియన్..

పాలక్కడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఎంఎస్ (రీసెర్చ్), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరు కనీసం 500 పదాలతో స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ) పంపాల్సి ఉంటుంది. తరవాత సెలెక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారం రిటెన్ టెస్ట్/ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
రీసెర్చ్ విభాగాలు
బయలాజికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ అండ్ సస్టయినబుల్ ఇంజనీరింగ్
అర్హత
ఎంఎస్(రీసెర్చ్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ సైన్సెస్ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ అభ్యర్థులు, మెంబర్‌షిప్ ఎగ్జామ్స్ (పార్ట్ - ఏ, పార్ట్ - బీ) ఉత్తీర్ణులు కూడా అర్హులే. 8.0 సీజీపీఏ ఉండాలి. గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
పీహెచ్‌డీలో ప్రవేశానికి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ సైన్సెస్/ హ్యుమానిటీస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు; ఎంఎస్ (రీసెర్చ్) పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ లేదా సీఎస్‌ఐఆర్ - ఎల్‌ఎస్ అండ్ జేఆర్‌ఎఫ్/ ఎన్‌బీహెచ్‌ఎం/ఇన్‌స్పయిర్/ ఐసీఎంఆర్/ జెస్ట్ అర్హత పొంది ఉండాలి. లేదంటే గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
సమాచారం
దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10
అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ విడుదల: నవంబరు 20
ఎస్‌ఓపీ సబ్మిషన్‌కు చివరి తేదీ: నవంబరు 27
ఇంటర్వ్యూలు: డిసెంబరు 1 నుంచి 14 వరకు
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: డిసెంబరు 17
వెబ్‌సైట్: resap.iitpkd.ac.in