IIM Bangaloreలో ఎంబీఏ, పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2021-10-31T14:27:31+05:30 IST

బెంగళూరులోని..

IIM Bangaloreలో ఎంబీఏ, పీహెచ్‌డీ

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) - ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. జాతీయ పరీక్ష స్కోర్‌/ ఐఐఎంబీ టెస్ట్‌ స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.


పీహెచ్‌డీ

ప్రోగ్రామ్‌ వ్యవధి: అయిదేళ్లు.

ట్యూషన్‌ ఫీజు: లేదు. 

పరిశోధన అంశాలు: డెసిషన్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ, స్ట్రాటజీ

అర్హత వివరాలు: ఏదేని స్పెషలైజేషన్‌తో మాస్టర్స్‌ డిగ్రీ/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. బీకాంతోపాటు సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్‌ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఏ కోర్సులోనైనా కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రథమశ్రేణి మార్కులతో నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ పూర్తిచేసినవారూ అర్హులే. అభ్యర్థులు ఎంచుకొన్న పరిశోధన అంశాన్ని అనుసరించి 2022 జనవరి 19 నాటికి  జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ క్యాట్‌/ గేట్‌/ జేఆర్‌ఎఫ్‌ నెట్‌  వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. లేదంటే ఐఐఎంబీ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. 

స్టయిపెండ్‌: అయిదేళ్ల పాటు నెలకు రూ.35,000 ఇస్తారు. మొదటి ఏడాది స్టార్టప్‌ గ్రాంట్‌ కింద రూ.75,000; రెండో ఏడాది నుంచి కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.25,000 ఇస్తారు. పోస్ట్‌ కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ స్టయిపెండ్‌ ఇంక్రిమెంట్‌ కింద నెలకు రూ.2,000; పోస్ట్‌ ప్రపోజల్‌ స్టయిపెండ్‌ ఇంక్రిమెంట్‌ కింద నెలకు రూ.3,000 చెల్లిస్తారు. హెచ్‌ఆర్‌ఏ కింద ప్రతినెలా అవివాహితులకు రూ.15,000 వివాహితులకు రూ.20,000 ఇస్తారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గ్రాంట్‌ కింద ఒక్కో రీసెర్చ్‌ పేపర్‌కు రూ.20,000; ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గ్రాంట్‌ కింద మొదటి పేపర్‌కు రూ.1,50,000 తరవాతి పేపర్లకు ఒక్కోదానికి రూ.75,000 చెల్లిస్తారు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జాతీయ పరీక్ష స్కోర్‌ ఉన్నవారికి రూ.1000; ఐఐఎంబీ టెస్ట్‌ రాసేవారికి రూ.2000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 19

ఐఐఎంబీ టెస్ట్‌ తేదీ: 2022 ఫిబ్రవరి 6

ఇంటర్వ్యూలు: 2022 ఏప్రిల్‌ 11 నుంచి 16 వరకు

ఇంటర్వ్యూ వేదిక: బెంగళూరు


ఎంబీఏ

ఈ డిగ్రీ కింద ఏడాది వ్యవధిగల ఫుల్‌ టైం, రెండేళ్ల వ్యవధి గల వీకెండ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌: దీనిని ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఈపీజీపీ)గా పరిగణిస్తారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. ప్రస్తుతం మూడో రౌండ్‌ అప్లికేషన్‌ విండో ఓపెన్‌ అయింది. ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, ఇంటర్‌ తరవాత సీఏ/ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్‌ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. 2022 మార్చి 31 నాటికి అయిదు నుంచి పన్నెండేళ్ల అనుభవం ఉండాలి. 2017 జనవరి 11 నుంచి 2021 డిసెంబరు 10 మధ్య రాసిన జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోర్‌ ఉండాలి. 


ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: రూ.5,000

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10

ఇంటర్వ్యూలు: డిసెంబరు 20, 21, 22

వీకెండ్‌ ప్రోగ్రామ్‌: దీనిని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎంటర్‌ప్రైజ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీఈఎం)గా పరిగణిస్తారు.  కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2022 మార్చి 31 నాటికి కనీసం నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. క్యాట్‌/ జీమ్యాట్‌/ జీఆర్‌ఈ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. లేదంటే ఐఐఎంబీ టెస్ట్‌ రాయాలి. 


ముఖ్య సమాచారం:

దరఖాస్తు ఫీజు: జాతీయ పరీక్ష స్కోర్‌ ఉన్నవారికి రూ.1500; ఐఐఎంబీ టెస్ట్‌ రాసేవారికి రూ.2,500

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 20

ఐఐఎంబీ టెస్ట్‌: 2022 ఫిబ్రవరి 6

ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి 18, 19, 20

ఐఐఎంబీ టెస్ట్‌ వివరాలు: పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో ఇంగ్లీష్‌ గ్రామర్‌, క్వాంటిటేటివ్‌, వెర్బల్‌, లాజికల్‌, డేటా సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద హెచ్‌బీ పెన్సిల్‌తో గుర్తించాలి. రుణాత్మక మార్కులు ఉన్నాయి.


వెబ్‌సైట్‌: iimb.ac.in

Updated Date - 2021-10-31T14:27:31+05:30 IST