కిట్టూర్‌ రాణి చెన్నమ్మ బాలికల సైనిక్‌ స్కూల్‌లో.. ప్రవేశాలు

ABN , First Publish Date - 2021-11-09T17:50:08+05:30 IST

కర్ణాటకలోని కిట్టూర్‌ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌..

కిట్టూర్‌ రాణి చెన్నమ్మ బాలికల సైనిక్‌ స్కూల్‌లో.. ప్రవేశాలు

కర్ణాటకలోని కిట్టూర్‌ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌.... 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆరోతరగతిలో ప్రవేశానికి అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.


ఈ పాఠశాల కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాలోని కిట్టూర్‌లో ఉంది. నేరుగా ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో లేకున్నా రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతితో సైనిక పాఠశాలల సొసైటీ మార్గదర్శకాల మేరకే కొనసాగుతోంది. వయసు, ఫీజులు, స్కాలర్‌షిప్పులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, అడ్మిషన్‌ విధానాలు వంటివన్నీ ఈ సొసైటీ నిర్దేశించిన మేరకే ఉంటాయి. 1969లో ఈ పాఠశాల ప్రారంభమెంది. అప్పటి విద్యా శాఖ మంత్రి ఎస్‌.ఆర్‌. క్రాంతి దీన్ని స్థాపించారు. 1967లో ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఈ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తరవాత నాటి కేంద్ర విద్యా శాఖ మంత్రి వీకేఆర్‌వీ రావ్‌ దీన్ని 1969లో ప్రారంభించారు.


బాలికలకు ప్రత్యేకంగా మిలిటరీ, సైనిక పాఠశాలల విధానంలో నడుస్తున్న పాఠశాల ఇది. ప్రస్తుతం ఇందులో 800 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఆరు నుంచి పన్నెండో తరగతి వరకూ విద్యాబోధన జరుగుతోంది. కర్ణాటక లోని కిట్టూర్‌, బెంగుళూరు, విజయపూర్‌, కలబుర్గీ కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కర్నాటక ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తారు. పూర్తి సమాచారం కోసం కార్యాలయం వేళల్లో సైనిక పాఠశాలకు చెందిన 8123409432, 99866652690 మొబైల్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.


ముఖ్య సమాచారం

అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణత

వయసు: 2021 జూన్‌ 1 నుంచి 2012 మే 31 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష తేదీ: 2022 జనవరి 30

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31

ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: 2022 జనవరి 15

చిరునామా: ద ప్రిన్సిపల్‌ కిట్టూర్‌ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌, కిట్టూర్‌- 591115, బెలగావీ డిస్ట్రిక్ట్‌, కర్ణాటక.

వెబ్‌సైట్‌: http://kittursaini-kschool.in/

Updated Date - 2021-11-09T17:50:08+05:30 IST