ISROలో జేటీఓలు
ABN , First Publish Date - 2021-11-05T15:17:23+05:30 IST
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి..

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరులోని ఇస్రో-హ్యూమన్ స్పేస్ రీసెర్చ్ ఫ్లైట్ సెంటర్(హెచ్‌ఎ్‌సఎ్‌ఫసీ)... తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీఓ) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 06
అర్హత: హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. హిందీ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్‌లేట్ చేయడం వచ్చి ఉండాలి.
వయసు: 2021 నవంబరు 20 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్ర్కిప్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్ ‘ఏ’ ఆబ్జెక్టివ్, పార్ట్ ‘బి’ డిస్ర్కిప్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఈ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20
వెబ్‌సైట్: https://www.isro.gov.in/