జాబ్ కార్నర్
ABN , First Publish Date - 2021-03-24T18:26:21+05:30 IST
అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దివ్యాంగుల కోటా కింద ఒప్పంద ప్రాతిపదికన నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.

అనంతపురంలో నర్సులు
అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దివ్యాంగుల కోటా కింద ఒప్పంద ప్రాతిపదికన నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీలు: 4
అర్హత: జీఎన్‌ఎం డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతోపాటు జీఎన్‌ఎం కౌన్సిల్/ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 2020 జూలై 1 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్‌కు 75 శాతం, అనుభవానికి 15 శాతం, సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ ఇస్తూ అర్హులను ఎంపిక చేస్తారు.
స్వయంగా లేదా రిజిస్టరు పోస్టు ద్వారా దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: మార్చి 27
చిరునామా: ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం
వెబ్‌సైట్: ananthapuramu.ap.gov.in
గుంటూరులో డేటా ఎన్యూమరేటర్లు
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని లామ్ రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, డేటా ఎన్యూమరేటర్ల నియామకానికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఖాళీలు: 2
అర్హత: బీటెక్ ఉత్తీర్ణతతోపాటు డేటా ప్రాసెసింగ్ అండ్ ప్రైస్ ఫోర్‌కాస్టింగ్ అనాల్సి్‌సలో అనుభవం అవసరం.
వయసు: పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
ఒప్పంద వ్యవధి: జూన్ వరకు
వేతనం: నెలకు రూ.20,000
గూగుల్ మీట్ ఇంటర్వ్యూలు: మార్చి 30న
ఈ మెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27
ఈ మెయిల్: amic2018angrau@gmail.com
వెబ్‌సైట్: angrau.ac.in