విశాఖ టీఎంసీలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-02-26T18:17:12+05:30 IST

టాటా మెమోరియల్‌ సెంటర్‌ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష / పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విశాఖ టీఎంసీలో ఖాళీలు

టాటా మెమోరియల్‌ సెంటర్‌ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష / పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్లు

ఖాళీలు: 4

ఒప్పంద వ్యవధి: ఆర్నెల్లు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి. క్లరికల్‌ వర్కుకు సంబంధించి ఏడాది అనుభవం అవసరం.

వయసు: దరఖాస్తు నాటికి 27 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.20,000 మధ్య

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: మార్చి 1


సీనియర్‌ రెసిడెంట్లు

ఖాళీలు: 4

విభాగాలు: పాథాలజీ 1, అనెస్తీషియాలజీ 1, న్యూక్లియర్‌ మెడిసిన్‌ 2

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ / డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు తప్పనిసరి. 

వయసు: దరఖాస్తు నాటికి 40 ఏళ్లు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.1,01,000

దరఖాస్తు ఫీజు: రూ.300 (మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28

హార్డుకాపీ పంపాల్సిన ఈమెయిల్‌: hrd@hbchrcv.tmc.gov.in


ముఖ్య సమాచారం

చిరునామా / వేదిక: హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌, వరుణ్‌ మోటార్స్‌ తరవాత అగనంపూడి, విశాఖపట్నం - 530053

వెబ్‌సైట్‌: tmc.gov.in

Updated Date - 2021-02-26T18:17:12+05:30 IST