ఇఫ్లూలో ఫ్యాకల్టీ
ABN , First Publish Date - 2021-04-29T20:54:08+05:30 IST
హైదరాబాద్‌లోని ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. హైదరాబాద్ సహా షిల్లాంగ్, లక్నో రీజనల్ క్యాంపస్‌లలో
హైదరాబాద్‌లోని ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. హైదరాబాద్ సహా షిల్లాంగ్, లక్నో రీజనల్ క్యాంపస్‌లలో నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 33 పోస్టులు ప్రకటించారు.
విభాగాలు: లింగ్విస్టిక్స్ అండ్ కాంటెంపరరీ ఇంగ్లీష్, ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ స్టడీస్, మెటీరియల్స్ డెవల్‌పమెంట్ - టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - లింగ్విస్టిక్స్ అండ్ ఫోనెటిక్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, అరబ్ స్టడీస్, ఈస్థటిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫోనెటిక్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, ట్రైనింగ్ అండ్ డెవల్‌పమెంట్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఇండియా అండ్ వరల్డ్ లిటరేచర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్.
బ్యాక్‌లాగ్ ఖాళీలు: 14
ఉద్యోగాలు: ప్రొఫెసర్లు 5, అసోసియేట్ ప్రొఫెసర్లు 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1
రెగ్యులర్ ఖాళీలు: 19
ఉద్యోగాలు: ప్రొఫెసర్లు 9, అసోసియేట్ ప్రొఫెసర్లు 10
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: మే 18
వెబ్‌సైట్: www.eflunivarsity.ac.in
సీసీఎంబీలో సైంటిస్టులు
హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్-సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్టు సైంటిస్ట్ (1, 2)
మొత్తం ఖాళీలు: 4
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: ప్రాజెక్టు సైంటి్‌స్ట-1కు 35 ఏళ్లు, ప్రాజెక్టు సైంటి్‌స్ట-2కు 40 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్: ప్రాజెక్టు సైంటిస్ట్-1 పోస్టుకి నెలకు రూ.56,000+హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్టు సైంటిస్ట్-2 పోస్టుకి నెలకు రూ.67,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 2
వెబ్‌సైట్: https://www.ccmb.res.in/Career-s/ProjectPositions
ఎన్‌బీఈ-ఎ్‌ఫఎంజీఈ జూన్-2021 సెషన్
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ) మెడికల్ గ్రాడ్యుయేట్‌లకు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎ్‌ఫఎంజీఈ) కోసం దరఖాస్తులు కోరుతోంది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన మెడికల్ గ్రాడ్యుయేట్లు భారతదేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఎన్‌బీఈ ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహిస్తుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్(సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష తేదీ: 2021 జూన్ 18
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.5,500
దరఖాస్తుకు చివరి తేదీ: మే 6