బీబీనగర్‌ ఎయిమ్స్‌లో.. Medical Staff

ABN , First Publish Date - 2021-10-21T16:13:28+05:30 IST

భారత ప్రభుత్వ ఆరోగ్య..

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో.. Medical Staff

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ(బీబీనగర్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌) 63 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1. సీనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌): 38

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ అనెస్తీషియా, పీడియాట్రిక్స్‌, బయోకెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అండ్‌ రేడియాలజీ, ఆప్తల్మాలజీ అండ్‌ ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.

అర్హత: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎ్‌స/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి


2. జూనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌): 25

అర్హత: ఎంబీబీఎ్‌స/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఐ/రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 37 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: దరఖాస్తులు పోస్టుల కన్నా మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ తక్కువ దరఖాస్తులు వస్తే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 09

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

Updated Date - 2021-10-21T16:13:28+05:30 IST