JNTUHలో ఐడీడీఎంపీ
ABN , First Publish Date - 2021-10-14T14:42:41+05:30 IST
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్), స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐడీడీఎంపీ)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలయింది. జేఈఈ (మెయిన్) 2021/ టీఎస్ ఎంసెట్ 2021 ర్యాంక్, కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జేఈఈ మెయిన్ అభ్యర్థులకు 30 శాతం సీట్లు ప్రత్యేకించారు. మిగిలిన సీట్లను టీఎస్ ఎంసెట్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మెరిట్ స్కాలర్ షి్‌పనకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ పూర్తయిన తరవాత స్వీడన్‌లో ఉద్యోగ/ వ్యాపార అవకాశాలు సాధించేందుకు వీలుగా ఏడాదిపాటు రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారు.
పోగ్రామ్ వివరాలు
ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. ఇందులో 10 సెమిస్టర్‌లు ఉంటాయి. మొదటి మూడున్నరేళ్లు (ఏడు సెమిస్టర్‌లు) హైదరాబాద్ జేఎన్‌టీయూలో; చివరి ఏడాదిన్నర కోర్సు (మూడు సెమిస్టర్‌లు)ను స్వీడన్ బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. బీటెక్, ఎంటెక్ డిగ్రీలను జేఎన్‌టీయూహెచ్; ఎమ్మెస్సీ డిగ్రీని బీటీహెచ్ ప్రదానం చేస్తాయి. ప్రోగ్రామ్ మధ్యలో కోర్సుల నుంచి వైదొలగే వీలు లేదు.
సీట్ల వివరాలు
ఈసీఈ: ఈ విభాగంలో 20 సీట్లు ఉన్నాయి. బీటెక్ (ఈసీఈ), ఎంటెక్(టెలీ కమ్యూనికేషన్ సిస్టమ్స్) కోర్సులను జేఎన్‌టీయూహెచ్‌లో; ఎమ్మెస్సీ(టెలీకమ్యూనికేషన్ సిస్టమ్స్) కోర్సును బీటీహెచ్‌లో చదవాలి.
సీఎ్‌సఈ: ఇందులో 40 సీట్లు ఉన్నాయి. బీటెక్ (సీఎ్‌సఈ), ఎంటెక్(సీఎ్‌సఈ/ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) కోర్సులను జేఎన్‌టీయూహెచ్‌లో; ఎమ్మెస్సీ(సీఎ్‌సఈ/ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) కోర్సును బీటీహెచ్‌లో చదవాలి. రెండు స్పెషలైజేషన్‌లకు సమానంగా సీట్లు కేటాయించారు.
మెకానికల్: ఈ విభాగంలో 15 సీట్లు ఉన్నాయి.
అర్హత: బీఐఈ/ సీబీఎ్‌సఈ/ ఐసీఎస్‌ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులు తప్పనిసరి. ప్రోగ్రామ్ ప్రారంభం నాటికి అభ్యర్థుల వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.2,000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 30
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్ మార్కుల పత్రాలు; జేఈఈ (మెయిన్) 2021/ టీఎస్ ఎంసెట్ 2021 ర్యాంక్ కార్డ్; కుటుంబ ఆదాయ ధృవపత్రాలు
కౌన్సెలింగ్ తేదీ: నవంబరు 9
వెబ్‌సైట్: jntuh.ac.in