NIMSలో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-10-21T16:03:42+05:30 IST

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌..

NIMSలో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) - ‘మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌’ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది.  కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. ఇందులో ఆర్నెల్ల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంది. మొత్తం 20 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇది ఫుల్‌ టైం కోర్సు. కోర్సు సమయంలో ఇతర డిగ్రీ/ డిప్లొమా ప్రవేశాలకు, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌/ కన్సల్టేషన్‌లకు అనుమతించరు. గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో కోర్సును పూర్తి చేయాలి.


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్‌/ నాన్‌ మెడికల్‌ విభాగాల్లో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఎంట్రెన్స్‌ టెస్ట్‌

దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. హెల్త్‌ సైన్సె్‌సకు సంబంధించి 40, అడ్మినిస్ట్రేషన్‌ అంశాలనుంచి 10, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల నుంచి 10, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి 15, టెస్టింగ్‌ ఆఫ్‌ ఐక్యూకు సంబంధించి 15, ఇంగ్లీష్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 2 గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థులకు కనీసం 40 శాతం; ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు రావాలి.     


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 30

దరఖాస్తు హార్డ్‌ కాపీ చేరేందుకు చివరి తేదీ: నవంబరు 3

చిరునామా: అసోసియేట్‌ డీన్‌, అకడమిక్‌ - 2, రెండో అంతస్తు, పాత ఓపీడీ బ్లాక్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ - 500082

వెబ్‌సైట్‌: nims.edu.in


Updated Date - 2021-10-21T16:03:42+05:30 IST