నిరుద్యోగులకు శుభవార్త.. 4135 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-10-20T15:06:05+05:30 IST

నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగులకు శుభవార్త.. 4135 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌)...2022-23 సంవత్సరానికి గాను కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా జాతీయ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 4135

అర్హత: 2021 నవంబరు 10 నాటికి ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌), ఇంటర్వ్యూ ఆధారంగా


ప్రిలిమినరీ పరీక్ష: దీనిని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. దీనిలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి...

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 30 ప్రశ్నలు - 30 మార్కులు- 20 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 35 ప్రశ్నలు - 35 మార్కులు- 20 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు- 20 నిమిషాలు

ఈ అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.


మెయిన్స్‌ పరీక్ష: దీనిని మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 25 మార్కులకు ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్‌, ఎస్సే) టెస్ట్‌ను నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమంలో ఉంటుంది. 

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ - 45 ప్రశ్నలు-60 మార్కులు- 60 నిమిషాలు

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ - 40 ప్రశ్నలు- 40 మార్కులు- 35 నిమిషాలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 35 ప్రశ్నలు - 40 మార్కులు- 40 నిమిషాలు

డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ - 35 ప్రశ్నలు - 60 మార్కులు- 45 నిమిషాలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్‌, ఎస్సే) - 02 ప్రశ్నలు- 25 మార్కులు - 30 నిమిషాలు

మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాఽధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 20

ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 10

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబరు 04, 11

మెయిన్స్‌ పరీక్ష: 2022 జనవరి

ఇంటర్వ్యూ: 2022 ఫిబ్రవరి/మార్చి

వెబ్‌సైట్‌: https://www.ibps.in/



Updated Date - 2021-10-20T15:06:05+05:30 IST