OUలో దూర విద్య కోర్సులు

ABN , First Publish Date - 2021-11-23T16:14:57+05:30 IST

హైదరాబాద్‌లోని..

OUలో దూర విద్య కోర్సులు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనున్న ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ)... 2021-22 విద్యా సంవత్సరానికి గాను వివిధ దూర విద్య(డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


పీజీ కోర్సులు

ఎంబీఏ: కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌(10+2+3 విధానంలో) ఉత్తీర్ణత. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే చాలు.

ఎంపిక: టీఎస్‌ ఐసెట్‌ 2021/ఏపీ ఐసెట్‌ 2021లో ఉత్తీర్ణత లేదా పీజీఆర్‌ఆర్‌సీడీఈ, ఓయూ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి.


ఎంసీఏ: కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ(10+2+3, లేదా 10+2+4, 10+3+3 విధానాల్లో) ఉత్తీర్ణత. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే చాలు.

ఎంపిక: టీఎస్‌ ఐసెట్‌ 2021/ఏపీ ఐసెట్‌ 2021లో ఉత్తీర్ణత లేదా పీజీఆర్‌ఆర్‌సీడీఈ, ఓయూ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొంది ఉండాలి.


ఎంఏ(ఉర్దూ/హిందీ/తెలుగు/ సంస్కృతం/ఇంగ్లీష్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. 


ఎంఏ(ఫిలాసఫీ/సోషియాలజీ/పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: ఎవరైనా గ్రాడ్యుయేట్‌ ఫ్యాకల్టీ


ఎంఏ (ఎకనామిక్స్‌/పొలిటికల్‌ సైన్స్‌/హిస్టరీ/ సైకాలజీ): కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టును చదివి ఉండాలి. ఎంఏ(ఎకనామిక్స్‌) కోర్సుకు బీకాం ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంకాం: కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: బీకాంలో ఉత్తీర్ణత.


ఎమ్మెస్సీ(మేథమెటిక్స్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.


ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు. 

అర్హత: మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.


యూజీ కోర్సులు

బీఏ: కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణత


బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌): కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు

అర్హత: మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణత


బీకాం(జనరల్‌): కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణత


బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ): కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణత


పీజీ డిప్లొమా కోర్సులు

పీజీ డిప్లొమా ఇన్‌ మేథమెటిక్స్‌: కోర్సు వ్యవధి ఏడాది

అర్హత: సంబంధిత సబ్జెక్టుతో  గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఫ్యాకల్టీ 


పీజీ డిప్లొమా ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌: కోర్సు వ్యవధి ఏడాది

అర్హత: సంబంధిత సబ్జెక్టుతో  గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఫ్యాకల్టీ


పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌: కోర్సు వ్యవధి ఏడాది

అర్హత: ఎవరైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఫ్యాకల్టీ


పీజీ డిప్లొమా ఇన్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌: కోర్సు వ్యవధి ఏడాది

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఎస్సీ(అగ్రి)/బీఫార్మసీ /బీవీఎస్సీ/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/బీఈ ఉత్తీర్ణత.


పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (రెండు సెమిస్టర్లు): కోర్సు వ్యవధి ఏడాది

అర్హత: ఎవరైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఫ్యాకల్టీ


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 15

వెబ్‌సైట్‌: http://www.oucde.net/

Updated Date - 2021-11-23T16:14:57+05:30 IST