NIFTలో డిప్లొమా, పీజీ డిప్లొమా

ABN , First Publish Date - 2021-10-07T14:47:55+05:30 IST

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌..

NIFTలో డిప్లొమా, పీజీ డిప్లొమా

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)- డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. క్వాలిఫయింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రజంటేషన్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


ఫ్యాషన్‌ ఫిట్‌ అండ్‌ స్టయిల్‌: ఇది యూజీ డిప్లొమా ప్రోగ్రామ్‌. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 35 సీట్లు ఉన్నాయి. ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. పదోతరగతి తరవాత ఫుల్‌టైం డిప్లొమా కోర్సులు చేసినవారు కూడా అర్హులే. కోర్సు ఫీజు ఏడాదికి రూ.2లక్షలు. ఈ కోర్సు పూర్తిచేసినవారు డిజైనర్‌, ఫ్రీలాన్స్‌ డిజైన్‌ కన్సల్టెంట్‌, డిజైన్‌ మేనేజర్‌, స్టయిలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ ట్రెం డ్స్‌ ఆర్గనైజర్‌, పాట్రన్‌ ఇంజనీర్‌గా రాణించవచ్చు.


పీజీ డిప్లొమాలు: ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి తరవాత డిప్లొమా కోర్సులు పూర్తిచేసి కనీసం రెండు/ మూడేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అర్హులే. ఒక్కో కోర్సులో 30 సీట్లు ఉన్నాయి.


అప్పారెల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మర్కండైజింగ్‌: ఈ కోర్సు పూర్తిచేసినవారు మర్కండైజర్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌, శాంపిలింగ్‌ మేనేజర్‌, క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌గా అవకాశాలు పొందవచ్చు.


ఓమ్నీ చానెల్‌ రిటైలింగ్‌ అండ్‌ ఈ- కామర్స్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సు పూర్తిచేసినవారు డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, కం టెట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ అడ్వర్టయిజింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.


ఫ్యాషన్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌: ఈ కోర్సు చేసినవారు బిజినెస్‌ కన్సల్టెంట్‌, న్యూ వెంచర్‌ డెవలపర్‌గా రాణించవచ్చు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.2150

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 11

క్వాలిఫయింగ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 13 నుంచి 15 వరకు

ఫలితాల విడుదల: అక్టోబరు 23

తరగతులు ప్రారంభం: నవంబరు 1 

వెబ్‌సైట్‌: www.nift.ac.in/chennai

Updated Date - 2021-10-07T14:47:55+05:30 IST