IIT Madrasలో డిప్లొమా
ABN , First Publish Date - 2021-11-05T14:45:13+05:30 IST
మద్రా్‌సలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ..

మద్రా్‌సలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ విభాగాలు ఎంచుకోవచ్చు. క్వాలిఫయర్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి 8 నెలలు. ఒక్కో ప్రోగ్రామ్‌లో 8 కోర్సులు ఉంటాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు ఇంజనీరింగ్ అర్హత లేకున్నా ప్రోగ్రామర్‌లుగా, డేటా సైంటి్‌స్టలుగా రాణించవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు
డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్‌లో కంప్యూటేషనల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ - డేటా స్ట్రక్చర్స్ - అల్గారిథమ్స్ యూజింగ్ పైథాన్, మోడరన్ అప్లికేషన్ డెవల్‌పమెంట్ - 1 ్క్ష 2, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ యూజింగ్ జావా, సిస్టమ్ కమాండ్స్ కోర్సులు ఉంటాయి.
డిప్లొమా ఇన్ డేటా సైన్స్‌లో మేథమెటిక్స్ ్క్ష స్టాటిస్టిక్స్ ఫర్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్స్ - థియరీ - ప్రాక్టీస్, బిజినెస్ డేటా మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, టూల్స్ ఇన్ డేటా సైన్స్ కోర్సులు ఉంటాయి.
ప్రోగ్రామ్‌లో భాగంగా ఆన్‌లైన్ వీక్లీ అసైన్‌మెంట్స్, మంత్లీ క్విజ్‌లు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రోగ్రామింగ్ ఎగ్జామ్‌లు, వైవా, ఎండ్ టర్మ్ ఎగ్జామ్ ఉంటాయి.
క్వాలిఫయర్ ఎగ్జామ్ వివరాలు
డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, బేసిక్ మేథమెటిక్స్ పేపర్‌లు ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్ 25 మార్కులకు ఉంటుంది. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, లిజెనింగ్ ఎబిలిటీ, గ్రామర్, రైటింగ్ అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్ పేపర్‌లో సెట్ థియరీ, నెంబర్ సిస్టమ్, కోఆర్డినేట్ జామెట్రీ, క్వార్డాటిక్ ఫంక్షన్స్, పాలినామియల్స్, ఫంక్షన్స్, లాగరిథమ్స్, గ్రాఫ్ థియరీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.
డిప్లొమా ఇన్ డేటా సైన్స్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో ఇంగ్లీష్, ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్ పేపర్‌లు ఉంటాయి. ఇంగ్లీష్, మేథమెటిక్స్ పేపర్‌లు పై ప్రోగ్రామ్‌కు నిర్వహించేవాటి మాదిరిగానే ఉంటాయి. పైథాన్ పేపర్‌లో అల్గారిథమ్స్, కండిషనల్స్, ఇటరేషన్స్ అండ్ రేంజెస్, కలెక్షన్స్ ఇన్ పైథాన్ అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. స్టాటిస్టిక్స్ పేపర్‌లో డేటా, స్కేల్స్ ఆఫ్ మెజర్‌మెంట్, డేటా ఫ్రీక్వెన్సీ, వేరియబుల్స్, ప్రాబబిలిటీ తదితర అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటేషనల్ థింకింగ్ పేపర్‌లో మల్టిపుల్ ఇటరేషన్స్, ఫిల్టరింగ్, ఫ్లో ఛార్ట్, సైడ్ ఎఫెక్ట్‌లు, గ్రాఫ్, మాట్రిక్స్, ట్రీ, బ్యాక్ ట్రాకింగ్, క్లాసిఫికేషన్ తదితర సాంకేతిక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 4 గంటలు
క్వాలిఫయర్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలంటే ఒక్కో పేపర్‌లో కనీసం 40 శాతం చొప్పున మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు రావాలి. వీరు మాత్రమే సంబంధిత డిప్లొమా ప్రోగ్రామ్‌నకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.6,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన దివ్యాంగులకు రూ.1500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15
క్వాలిఫయర్ ఎగ్జామ్ తేదీ: డిసెంబరు 12
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్.
ప్రోగ్రామ్ ఫీజు: రూ.63,000
ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ తేదీలు: డిసెంబరు 20 నుంచి 23 వరకు
తరగతులు ప్రారంభం: డిసెంబరు 27 నుంచి
వెబ్‌సైట్: diploma.iitm.ac.in