NHAIలో ఖాళీలు.. నెలకు రూ.56,100 జీతం.. చివరి తేదీ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2021-11-05T15:20:57+05:30 IST

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)లో కింది పేర్కొన్న పోస్టుల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NHAIలో ఖాళీలు.. నెలకు రూ.56,100 జీతం.. చివరి తేదీ ఎప్పుడంటే..

నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)లో కింది పేర్కొన్న పోస్టుల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు: డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌ & అకౌంట్స్‌)

మొత్తం ఖాళీలు: 17

అర్హత: బ్యాచిలర్‌ ఇన్‌ కామర్స్‌/సీఏ/సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌/మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్ష విధానం: ఈ పరీక్షలో పార్ట్‌-1, పార్ట్‌-2 అని రెండు విభాగాలుంటాయి. ఈ రెండు పేపర్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 29

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

Updated Date - 2021-11-05T15:20:57+05:30 IST