DOSTతో డిగ్రీ ప్రవేశాలు
ABN , First Publish Date - 2021-11-08T15:40:30+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి..
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి- డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు చెందిన అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా రిజిస్ర్టేషన్ వెబ్ ఆప్షన్ గడువును నవంబరు 20 వరకు పొడిగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 105 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో 1, యూనివర్సిటీ స్థాయిలో 6, జిల్లా స్థాయిలో 33, కాలేజీ స్థాయిలో 65 సెంటర్లు పనిచేస్తాయి.
కోర్సులు: బీఏ, బీకాం, బీకాం(ఒకేషనల్), బీకాం (ఆనర్స్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎ్‌సడబ్ల్యూ, డీహెచ్‌ఎంసీటీ, డీఫార్మసీ
దరఖాస్తు: ఆధార్ నెంబరు లింక్ చేసి ఉన్న మొబైల్ ద్వారా దోస్త్ వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్టరు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తిచేసి దోస్త్‌లో రిజిస్టరు చేసుకోవచ్చు. ఫొటో అథెంటికేషన్‌తో టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టరు కావచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరవాత దోస్త్ ఐడీ, పిన్ వస్తాయి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి. దోస్త్ ఐడీ, పిన్ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయితే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దీనిని నింపిన తరవాత విద్యార్థి ప్రయారిటీ ప్రకారం కోర్సు, కాలేజీ వివరాలను వెబ్ ఆప్షన్స్ కింద ఇవ్వాలి. విద్యార్థి మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ అలాట్ అవుతుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.400
రిజిస్ట్రేషన్: నవంబరు 20 వరకు
వెబ్ ఆప్షన్స్: నవంబరు 20 వరకు
స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్: నవంబరు 18
సీట్ అలాట్‌మెంట్: నవంబరు 24
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: నవంబరు 24 నుంచి 26 వరకు
వెబ్‌సైట్: https://dost.cgg.gov.in