టోలనీ ఇన్‌ స్టిట్యూట్‌లో మారిటైమ్‌ కోర్సులు

ABN , First Publish Date - 2021-05-08T20:17:54+05:30 IST

సముద్ర వర్తక రంగంలో భారత్‌కు విశేష ప్రాధాన్యముంది. జెట్‌ స్పీడుతో నౌకాయాన రంగం వృద్ధి చెందుతోంది. అందుకు ఏయేటికి ఆ ఏడు నమోదవుతున్న వృద్ధి గణాంకాలే నిదర్శనం.

టోలనీ ఇన్‌ స్టిట్యూట్‌లో మారిటైమ్‌ కోర్సులు

సముద్ర వర్తక రంగంలో భారత్‌కు విశేష ప్రాధాన్యముంది. జెట్‌ స్పీడుతో నౌకాయాన రంగం వృద్ధి చెందుతోంది. అందుకు ఏయేటికి ఆ ఏడు నమోదవుతున్న వృద్ధి గణాంకాలే నిదర్శనం. నౌకాయాన కోర్సులకు సైతం అదే స్థాయిలో డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రంగంలో సమర్థమంతమైన మానవ వనరులకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటోంది. కెప్టెన్‌, ఇంజనీర్‌, షిప్‌ బిల్డర్‌, డిజైనర్‌, పోర్ట్‌ మేనేజర్‌, లాజిస్టిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన పుణెలోని టోలనీ మారిటైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వివిధ ఫుల్‌టైం మారిటైమ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. ఈ కోర్సులు  2021 ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నాయి. అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


కోర్సులు: బీటెక్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌, బీఎస్సీ నాటికల్‌ సైన్స్‌

అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి , ఇంటర్‌లో  మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో కనీసం 60 శాతం; ఇంగ్లీ్‌షలో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.  

వయసు: అభ్యర్థులు కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి

శారీరక ప్రమాణాలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు అభ్యర్థుల శారీరక ప్రమాణాలు ఉండాలి. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌లో వచ్చిన మార్కులు, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఐఎంయూ టెస్ట్‌ ర్యాంక్‌, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ ఎంపిక ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత ఇంటర్‌ మార్కులు, ఐఎంయూ టెస్ట్‌ ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ టెస్టులో అర్హత సాధించిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. 


పరీక్ష విధానం: పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మేథ్స్‌ నుంచి 30 ప్రశ్నలు, ఫిజిక్స్‌ నుంచి 30, అనలిటికల్‌ నుంచి 10, రీజనింగ్‌ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రం ఇంటర్‌ స్థాయిలో ఉంటుంది. ఈ టెస్టును దేశవ్యాప్తంగా 13 కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలగు రాష్ట్రాల విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 2021 జూన్‌ 30

దరఖాస్తు ఫీజు: రూ.1200

వెబ్‌సైట్‌: https://tmi.tolani.edu/ 


Updated Date - 2021-05-08T20:17:54+05:30 IST