IHMలో బీఎస్సీ

ABN , First Publish Date - 2021-10-21T16:07:52+05:30 IST

చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌..

IHMలో బీఎస్సీ

చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ - బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ), ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) ఉమ్మడి సహకారంతో ఈ రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌ని రూపొందించారు. ఎస్సీ అభ్యర్థులకు 14, ఎస్టీ అభ్యర్థులకు 26 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 


అర్హత

గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి సైన్స్‌/ ఆర్ట్స్‌/ కామర్స్‌/ ఒకేషనల్‌ సబ్జెక్ట్‌లతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్‌ స్థాయిలో ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


ముఖ్య సమాచారం

ఈ మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 28 

ఈ మెయిల్‌: ihmtaramani@gmail.com

వెబ్‌సైట్‌: ihmchennai.org

Updated Date - 2021-10-21T16:07:52+05:30 IST