Hyderabad, FCRIలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
ABN , First Publish Date - 2021-11-05T14:49:41+05:30 IST
సిద్దిపేట జిల్లా ములుగులోని..

సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) హైదరాబాద్ - ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 60 క్రెడిట్స్ నిర్దేశించారు. అకడమిక్ ప్రతిభ, ఐకార్ - ఏఐఈఈఏ పీజీ 2021 స్కోర్, కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 24 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో ప్రవేశం పొందినవారు ఇతర డిగ్రీ/ డిప్లొమా కోర్సులు చేసేందుకు అనుమతించరు. హాస్టల్ సౌకర్యం ఉంది.
స్పెషలైజేషన్‌లు - సీట్లు: సిల్వికల్చర్ అండ్ అగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్ బయాలజీ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లకు ఒక్కోదానిలో 6 సీట్లు; ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ యుటిలైజేషన్‌లో 4 సీట్లు; వైల్డ్ లైఫ్ సైన్సె్‌సలో 2 సీట్లు ఉన్నాయి.
అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 7 పాయింట్ల ఓజీపీఏ తప్పనిసరి. ఐకార్ - ఏఐఈఈఏ పీజీ 2021 అర్హత పొంది ఉండాలి. ఈటెస్ట్ స్కోర్‌కు 50 శాతం, అకడమిక్ ప్రతిభకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15
వెబ్‌సైట్: fcrits.in