ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగాలు.. 20ఏళ్లు ఉండి.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2021-09-03T16:57:56+05:30 IST

పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ స్కేల్‌-1, 2ల నియామకానికి దరఖా

ప్రభుత్వరంగ బ్యాంకులో ఉద్యోగాలు.. 20ఏళ్లు ఉండి.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు

పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌  ఆఫీసర్‌ స్కేల్‌-1, 2ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీలు190


పోస్టులు: అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌, లా ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌, ఐటీ సపోర్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌, డీబీఏ(ఎంఎస్ఎస్‌క్యూఎల్‌/ఒరాకిల్‌), విండోస్‌ అడ్మినిస్ట్రేటర్‌, ప్రొడక్టర్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌, నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, ఈమెయిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ తదితరాలు.


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబందిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ,  బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు


పరీక్ష విధానం: ఈ పరీక్షని ఐబీపీఎస్‌ ద్వారా నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల్లో పరీక్షను పూర్తిచేయాలి. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 18

వెబ్‌సైట్‌: https://www.bankofmaharashtra.in/

Updated Date - 2021-09-03T16:57:56+05:30 IST