Konkan Railwayలో అప్రెంటిస్‌లు
ABN , First Publish Date - 2021-10-28T16:11:58+05:30 IST
భారత ప్రభుత్వానికి చెందిన..

భారత ప్రభుత్వానికి చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(కేఆర్‌సీఎల్).... వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అప్రెంటి్‌సలు
మొత్తం ఖాళీలు: 139
1. డిప్లొమా అప్రెంటిస్: 52
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.3542 చెల్లిస్తారు
2. గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్: 87
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, మెకానికల్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 2021 అక్టోబరు 01 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.4984 చెల్లిస్తారు
ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 22
వెబ్‌సైట్: https://konkanrailway.com/