IAFలో 83 ఖాళీలు
ABN , First Publish Date - 2021-11-05T15:04:30+05:30 IST
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఏయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో గ్రూప్-సి సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: ఎల్‌డీసీ, ఎంటీఎస్, సూపరింటెండెంట్(స్టోర్), సీఎంటీడీ, కుక్ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితి నిబంధనలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్(2021 అక్టోబరు 30-నవంబరు 05)న్యూస్ పత్రికలో ఈ ప్రకటన వెలవడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: సంబంధిత రాష్ట్రాల ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://indianairforce.nic.in/