ఏపీలో 3393 ఖాళీల భర్తీకి.. విడుదలైన నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-10-29T15:15:19+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కాలపరిమితికి గాను కాంట్రాక్ట్ పద్ధతిన మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
జిల్లాల వారీగా ఖాళీలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం: 633
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా: 1003
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు: 786
చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు: 971
అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ(నర్సింగ్)లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్(సీపీసీహెచ్) తప్పనిసరిగా చదివి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు
కాంట్రాక్టు వ్యవధి: ఏడాది
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 06
వెబ్సైట్: cfw.ap.nic.in/MLHP2021.html