ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న నిమ్స్

ABN , First Publish Date - 2021-09-03T17:43:13+05:30 IST

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు వ్యవధి నాలుగున్నరేళ్లు. ఇందులోనే ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మొత్తం 50 సీట్లు ఉన్నా

ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న నిమ్స్

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు వ్యవధి నాలుగున్నరేళ్లు. ఇందులోనే ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 


అర్హత: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. ఒకేషనల్‌ ఫిజియోథెరపీతోపాటు బ్రిడ్జ్‌ కోర్సు (బయోలాజికల్‌/ ఫిజికల్‌ సైన్సెస్‌) పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.  అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు

దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 90 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లనుంచి ఇంటర్‌ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షని ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు.  ఇందులో అర్హత పొందాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థులకు 40 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.700

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 18

హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 21

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడింగ్‌: సెప్టెంబరు 30

ఎంట్రెన్స్‌ తేదీ: అక్టోబరు 3

ఫలితాలు విడుదల: అక్టోబరు 7

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: అక్టోబరు 12

కౌన్సెలింగ్‌ తేదీ: అక్టోబరు 18

కోర్సు ప్రారంభం: నవంబరు 1


దరఖాస్తు కాపీ పంపాల్సిన చిరునామా: ద అసోసియేట్‌ డీన్‌, అకడమిక్‌ - 2, రెండో అంతస్తు, పాత ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ - 500082

వెబ్‌సైట్‌: nims.edu.in

Updated Date - 2021-09-03T17:43:13+05:30 IST