ఐసర్‌ పుణెలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2021-05-08T20:15:14+05:30 IST

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాములో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు పూర్తిచేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ తోపాటు

ఐసర్‌ పుణెలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాములో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు పూర్తిచేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ తోపాటు పీహెచ్‌డీ డిగ్రీని ప్రదానం చేస్తారు. అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్షల స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


కెమిస్ట్రీ: ప్రథమ శ్రేణి మార్కులతో జనరల్‌ లేదా కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జామ్‌ (కెమిస్ట్రీ 2021) ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో 800 లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు 960 ర్యాంకు వరకూ అవకాశం కల్పిస్తారు.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25

ఇంటర్వ్యూలు: జూన్‌ 22 నుంచి 25 వరకు

వేదిక: ఐసర్‌ పుణె క్యాంపస్‌


మేథమెటిక్స్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. జామ్‌ (మేథమెటిక్స్‌ 2021) ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో 500 లోపు ర్యాంకు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడు వర్గాలవారికి 600 ర్యాంకు వరకూ అవకాశం ఉంటుంది. ఎన్‌బీహెచ్‌ఎం 2021 అర్హత పొందిన అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 16

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ వివరాలు త్వరలో ప్రకటిస్తారు.


ఫిజిక్స్‌: ప్రథమ శ్రేణి మార్కులతో బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ పూర్తిచేసినవారు అర్హులు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. ఇంటర్వ్యూ నాటికి వ్యాలిడ్‌ జామ్‌(ఫిజిక్స్‌) స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో 500 లోపు ర్యాంకు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌స్పయిర్‌ - పీహెచ్‌డీ ఫెలోషిప్‌ అర్హత పొందినవారు కూడా అర్హులే. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 21 

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: జూన్‌ 20 నుంచి 30 వరకు

ఈ మెయిల్‌:  doctoraloffice@iiserpune.ac.in

వెబ్‌సైట్‌: iiserpune.ac.in

Updated Date - 2021-05-08T20:15:14+05:30 IST