భవిష్యత్‌ అంతా టీడీపీదే : జయరాజు

ABN , First Publish Date - 2021-12-19T06:11:31+05:30 IST

భవిష్యత్‌ కాలమంతా తెలుగుదేశం పార్టీదేనని, వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని జడ్పీ మాజీ చైౖర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు అన్నారు.

భవిష్యత్‌ అంతా టీడీపీదే : జయరాజు
విలేకరులతో మాట్లాడుతున్న జడ్పీ మాజీ చైర్మన్‌ జయరాజు, తదితరులు

కామవరపుకోట, డిసెంబరు 18 భవిష్యత్‌ కాలమంతా తెలుగుదేశం పార్టీదేనని, వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని జడ్పీ మాజీ చైౖర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. పలు కారణాలతో మృతి చెందిన పార్టీ నేతల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆడమిల్లిలో ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో విసిగి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు.  ఎన్నిక ల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు, ఉద్యోగులు సిద్ధమయ్యా రన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ,  తెలుగు రైతు ఏలూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మద్దిపోటి నాగేశ్వర రాంబాబు, ఆడమిల్లి సర్చంచ్‌  కేశవరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:11:31+05:30 IST