యువకుడి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-10-26T04:26:36+05:30 IST

అనుమానాస్పదంగా ఒక యువకుడు మృతి చెందిన సంఘటన రేలంగిలో చోటు చేసుకున్నది.

యువకుడి అనుమానాస్పద మృతి

ఇరగవరం, అక్టోబరు 25: అనుమానాస్పదంగా ఒక యువకుడు మృతి చెందిన సంఘటన రేలంగిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రేలంగి పరిధిలో గవర్లపాలెంకు చెందిన చేబ్రోలు మణికంఠ (18) రేలంగిలో అంతెన్నవారిపేటలో కోళ్లఫారం వద్ద పని  చేస్తున్నాడు. అయితే సోమవారం యథావిధిగా మణికంఠ పనికి వచ్చాడు.  ఉదయం 11.30 గంటల సమయంలో కోళ్ళఫారం వద్దకు యజమాని స్నేహితుడు వెళ్లి చూడగ అక్కడ మణికంఠ పడి ఉండటాన్ని చూసి యజమానికి తెలపగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఇరగవరం ఎస్‌ఐ జానా సతీష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-10-26T04:26:36+05:30 IST