దళిత యువకుడిని నిమ్మల కొట్టారంటూ నిరసన

ABN , First Publish Date - 2021-12-15T05:42:29+05:30 IST

ఎమ్మెల్యే నిమ్మల దళిత యువకుడు కొండేటి సురేష్‌ను కొట్టడం, దూషించడం తగదని.. వెంటనే క్షమాపణ చెప్పా లని వైసీపీకి చెందిన పలువురు దళిత నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు.

దళిత యువకుడిని నిమ్మల కొట్టారంటూ నిరసన

అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఎమ్మెల్యే నిమ్మల


పాలకొల్లు అర్బన్‌ , డిసెంబరు 14 :
ఎమ్మెల్యే నిమ్మల దళిత యువకుడు కొండేటి సురేష్‌ను కొట్టడం, దూషించడం తగదని.. వెంటనే క్షమాపణ చెప్పా లని వైసీపీకి చెందిన పలువురు దళిత నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు. నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం గాంధీ బొమ్మల సెంటర్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో దళిత యువకుడిని అవమానించారన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గాంధీ బొమ్మల సెంటర్‌లో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నిమ్మల తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నేను అవమా నించానని అంటున్న కొండేటి సురేష్‌ నియోజకవర్గ తెలుగు యువత నాయ కుడు, నాకు సోదరుడి వంటివాడు అన్నారు. ట్రాఫిక్‌కు అడ్డురావద్దని కార్యకర్త లను వెనక్కి నెట్టాను అంతే తప్ప సురేష్‌ను కొట్టలేదన్నారు. దళితుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు.  

Updated Date - 2021-12-15T05:42:29+05:30 IST