ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సాయుధ పోరాటానికి కూడా సిద్ధం

ABN , First Publish Date - 2021-10-22T04:51:02+05:30 IST

పట్టణంలో వైసీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు.

ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సాయుధ పోరాటానికి కూడా సిద్ధం
చింతలపూడి దీక్షలో ఎమ్మెల్యే ఎలీజా, తదితరులు

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 21: పట్టణంలో వైసీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ముందుగా వైఎస్‌ విగ్రహానికి ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా  పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతిపక్షాలను ఎదుర్కొవడానికి అవసరమైతే సాయుధ పోరాటానికి కూడా సిద్ధమన్నారు. వైసీపీ శ్రేణులు సహనం కోల్పోతే తమ ప్రతిఘటనకు తెలుగుదేశం పార్టీ భూస్ధాపితం అవుతుందన్నారు. దీక్ష కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


చింతలపూడి: పాతబస్టాండ్‌ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ప్రారంభించారు. టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో పి.శ్రీనివాసరావు, అలవాల బాబు, చుండూరి నాగేశ్వర రావు, రామరాజునాయుడు, గంధం చంటి, ఖాదర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:51:02+05:30 IST