పగలు 20 డిగ్రీలు.. రాత్రి 14 డిగ్రీలు

ABN , First Publish Date - 2021-12-26T05:43:06+05:30 IST

అమ్మో చలి.. గత పది రోజులుగా కనీసం బానుడు దర్శనమివ్వ డం లేదు..

పగలు 20 డిగ్రీలు.. రాత్రి 14 డిగ్రీలు
ఆచంటలో చలి కాగుతున్న చిన్నారులు

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న చలి



నరసాపురం/ఆచంట, డిసెంబరు 25 : అమ్మో చలి.. గత పది రోజులుగా కనీసం బానుడు దర్శనమివ్వ డం లేదు.. మధ్యాహ్నమైనా చలి తీవ్రత మాత్రం తగ్గడంలేదు.. చల్లగాలలుతో జనం వణికిపోతున్నారు. చలికి తట్టుకోలేక ఉదయం, సాయంత్ర వేళల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. శనివారం ఉదయం  9  గంటల వరకు పొగమంచు కూడా కమ్మేయడంతో రోడ్డుపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.  తీర ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఉదయం 8 దాటిన సూర్యకిరణాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పొలాలు, తోటలు, కొబ్బరి చెట్లు కారణంగా పొగ మంచు పెరిగింది. ఈ కారణంగా గోదావరిలో పడవల రాకపోకలు, ఇటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఇక పగటి పూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలోపే నమోదవుతున్నాయి. రాత్రి సమాయల్లో 14 డిగ్రీలకు పడిపోతుంది. ఈ కారణంగా రాత్రి 8 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా చలి పెరగడంతో వృద్ధులు, చిన్న పిల్లలు వణికి పోతున్నారు. స్పెట్టర్లు, మంకీక్యాప్‌లు లేకుండా బయటకు రావడం లేదు. ఇటు ఉదయం, సాయంత్ర సమయాల్లో గోదావరి గట్టు పై వ్యాయామం చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో చలి పులి మరింత పెరిగుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది.



Updated Date - 2021-12-26T05:43:06+05:30 IST