భర్త చేతిలో భార్య హతం

ABN , First Publish Date - 2021-12-07T06:22:45+05:30 IST

భార్యాభర్తల మధ్య వివాదం భార్య హత్యకు దారితీసింది.

భర్త చేతిలో భార్య హతం
హతురాలు ధనలక్ష్మితో భర్త వెంకటేశ్వరరావు (ఫైల్‌)

పెరవలి, డిసెంబరు 6 : భార్యాభర్తల మధ్య వివాదం భార్య హత్యకు దారితీసింది. పెరవలి ఎస్‌ఐ సూర్యభగవాన్‌ వివరాల ప్రకారం.. నడిపల్లి గ్రామానికి చెందిన ముత్యాల వెంకటేశ్వరరావు, భార్య ధనలక్ష్మి (37) నడిపల్లిలో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. వీరు తరచూ తగువులాడుకుం టుండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా వీరు గొడవపడ్డారు. దీంతో ఆదివారం  అర్ధరాత్రి వెంకటేశ్వరరావు రోకలి బండతో నిద్రిస్తున్న భార్య తలపై పలుమార్లు మోది పారిపోయాడు. ఆమె కేకలు విని వారి కుమారుడు, కుమార్తె నిద్రలేచి చుట్టుపక్కల వారి సాయంతో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయిందన్నారు. కుమారుడు సాయిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి తణుకు సీఐ సీహెచ్‌. ఆంజనేయులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ  భగవాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-07T06:22:45+05:30 IST