మహిళలకు సత్వర న్యాయం : ఎస్పీ నాయక్‌

ABN , First Publish Date - 2021-03-24T05:56:52+05:30 IST

మహిళలకు సత్వర న్యాయం అందించడంతోపాటు తగిన రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కె.నారాయ ణ నాయక్‌ చెప్పారు.

మహిళలకు సత్వర న్యాయం : ఎస్పీ నాయక్‌

ఏలూరు క్రైం, మార్చి 23 : మహిళలకు సత్వర న్యాయం అందించడంతోపాటు తగిన రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కె.నారాయ ణ నాయక్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 45 స్కూటర్లు, ఒక మినీ బస్సును ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు అప్పగించారు. తొలుత వాహనాల ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు, చిన్న పిల్లల రక్షణ నిమిత్తం దిశ చట్టాన్ని రూపొందించారని చెప్పారు. కేసు దర్యాప్తు, త్వరితగతిన చార్జ్‌ షీట్‌ దాఖలు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళా బాధితుల వద్దకు మహిళా పోలీసులు త్వరతిగతిన వెళ్లడానికి ప్రభుత్వం వాహనాలను సమకూర్చిందన్నారు. మహిళలకు జరుగుతు న్న అన్యాయాన్ని, దాడులను నిర్బయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎం.మహేష్‌కుమార్‌, ఎస్‌ ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీసీఎస్‌ డీఎస్పీ జీవిఎస్‌ పైడేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-24T05:56:52+05:30 IST