కూత పెంచిన కోడి..!

ABN , First Publish Date - 2021-07-12T05:36:46+05:30 IST

పదిహేను రోజుల వ్యవధిలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి.

కూత పెంచిన కోడి..!

కిలో చికెన్‌ రూ.300

పెరిగిన వినియోగం.. తగ్గిన సరఫరా 

15 రోజుల్లో కేజీకి వందకు పైగా పెంపు

ఏలూరు రూరల్‌/ఆకివీడు, జూలై 11 : పదిహేను రోజుల వ్యవధిలో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఆదివారం మార్కెట్‌లో కిలోకు రూ.100 వరకు పెరగ డంతో కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఏలూరు, తణుకు, ఆకివీడు, పాలకొల్లు, భీమవరం సహా మిగిలిన ప్రాంతాల్లోనూ రూ.280 నుంచి రూ.300 వరకు అమ్మకాలు సాగాయి. చికెన్‌ వినియోగం పెరగడం.. తగినంత లభ్యత లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతు న్నారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టగా ఏలూరులో సడలింపులు లభించాయి. ఈ పరిస్థితుల్లో చికెన్‌ అమ్మకాలు పెరిగాయి. జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్లు లేకపోవడంతో నెల్లూరు జిల్లాకు వెళ్లి కోళ్లు తీసుకొస్తుండడంతో ధరలు పెంచినట్టు ఆకివీడుకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.  

Updated Date - 2021-07-12T05:36:46+05:30 IST